మూసీతీరం..దందాలకు కేంద్రం!

by Ajay Maddhiboyina |

సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లో ఉన్న మూసీ నది తీరం దందాలకు కేం ద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

మూసీతీరం..దందాలకు కేంద్రం!
X

దిశ, రాజేంద్రనగర్: సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లో ఉన్న మూసీ నది తీరం దందాలకు కేం ద్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకు అనుగుణం గా అడుగులు కూడా వేస్తుంది. స్థా నికంగా ఉన్న జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. లం గర్ హౌస్ నుంచి అత్తాపూర్‌ను కలిపే బ్రిడ్జి తర్వాత మూసీ నది తీ రంలో కొన్నేళ్ల క్రితం అధికారులు రోడ్డు నిర్మాణం చేసి అభివృద్ధి చేశా రు. దీంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. లంగర్ హౌస్ నుంచి అత్తాపూర్ రాజేంద్రనగర్ వెళ్లే వాహనదారులు ఎక్కువగా ఈ రహదారిని వినియోగిస్తుంటారు.

పైసా వసూల్..

మూసీ నది తీరంలో ఏర్పాటు చేసి న రహదారి జీహెచ్ఎంసీ అధికారులకు డబ్బులు అందజేసే విధం గా మారింది. మూసీ నది తీరంలో నిబంధనల ప్రకారం ఎలాంటి దం దాలు నిర్వహించొద్దు. అయితే జీ హెచ్ఎంసీ సర్కిల్ అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నారు. మూసీ నది తీరంలో కొందరు నర్స రీలు, కొబ్బరి బోండా షాపులు ఏ ర్పాటు చేసుకున్నారు. వారి నుంచి అధికారులు నెల నెలా డబ్బులు వ సూలు చేసుకుంటున్నారని స్థానికు లు చెబుతున్నారు. మూసీ తీరంలో ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలకు విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఆయన ఆదేశాలతో ప్రతినెలా కింది స్థాయి సిబ్బంది దందాలు చేసుకుంటున్న వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమంగా నిర్వహిస్తున్న దందాల కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంద ని స్థానికులు అంటున్నారు.

Next Story