- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో అవకతవకలు..?
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అధికారులు అర్హులను కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తించిన

దిశ, మహేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అధికారులు అర్హులను కాకుండా ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తించిన వారికి ఇండ్లు మంజూరు చేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి కూడా ఇళ్లను మంజూరు చేయించారని పలువురు ఆరోపిస్తున్నారు.
కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పంది అనితకు 2009లో అప్పటి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అప్పుడు రూ.50 వేలు మాత్రమే డబ్బులు విడుదల చేశారు. ఈ ఏడాది మే 27న మరోసారి పంది అనితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె అర్హులని ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా సూచించారు. ఈ మేరకు పంది అనిత తనకున్న పాత ఇల్లును కూలగొట్టి కొత్త ఇల్లును కడుతున్నారు. నూతన ఇంటి నిర్మాణ పనులు పునాది వరకు సొంత డబ్బులను పెట్టుకొని పూర్తి చేశారు. దీంతో అనిత ఇంటి వద్దకు ఇటీవల అధికారులు వచ్చి ‘మీ పేరు మీద గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మీకు డబ్బులు (బిల్లు) రావు’ అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఏమి చేయాలో తోచని స్థితిలో పంది అనితతో పాటు చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. పాత ఇల్లును కూలగొట్టి కొత్త ఇల్లును నిర్మించడానికి అప్పులపాలు అయ్యామని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
ఉన్న ఇల్లు పోయింది..
ఈ ఏడాది మే 27న నాకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చారు. పాత ఇల్లు కూలగొట్టి కొత్త ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించా. కొత్త ఇంటి నిర్మాణ పనులు పునాది వరకు జరిగాయి. ప్రభుత్వ అధికారులు తమ ఇంటి వద్దకు వచ్చి మీకు గతంలో మీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, అందుకే డబ్బులు రావని తెలిపారు. గతంలో మాకు రూ.50 వేలు వచ్చాయని అధికారులకు తెలిపినా మాకు బిల్లు విడుదల చేయడం లేదు. మాకు రావాల్సిన బిల్లును అధికారులు వెంటనే విడుదల చేయాలి.
- పంది అనిత, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు
ప్రభుత్వం బిల్లులు ఆపింది..
మండలంలోని పలు గ్రామాల్లో గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి ప్రభుత్వం బిల్లులను ఆపింది. నిజమైన లబ్ధిదారులైతే విచారణ చేపడతాం. గతంలో మంజూరైన వారికి మా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడ్డాయి. ఫీల్డ్ లో లబ్ధిదారులు మాకు ఎలాంటి డబ్బులు పడడం లేదన్నారు. పొరపాట్లు జరిగిన వాటిపై పూర్తి విచారణ చేపడతాం.
- సరిత, కందుకూరు ఎంపీడీవో






