ఎస్ఎల్ఎన్ టెర్మినస్ పబ్ లో.. మందుబాబుల వీరంగం.!

by Geesa Chandu |   (  Updated:2024-08-18 06:23:18  IST  )

అర్ధరాత్రి వరకు ఫుల్ గా తాగిన మందుబాబులు రోడ్డుపై హల్చల్ చేశారు.

ఎస్ఎల్ఎన్ టెర్మినస్ పబ్ లో.. మందుబాబుల వీరంగం.!
X

దిశ, శేరిలింగంపల్లి: అర్ధరాత్రి వరకు ఫుల్ గా తాగిన మందుబాబులు రోడ్డుపై హల్చల్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎన్ఎల్ టెర్మినస్ షాపింగ్ మాల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మందుబాబులు భీభత్సం సృష్టించారు. వీకెండ్ అవడం వరన సెలవుల నేపథ్యంలో పబ్బులన్నీ కిటకిటలాడాయి. గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టెర్మినల్ లో పలు పబ్ లు ఉండగా.. అందులో ఓ పబ్ లో మందుబాబులు మద్యం మత్తులో అమ్మాయిని వేధించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం తోపులాట జరగడంతో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. కొందరు తమపై అసభ్యంగా ప్రవర్తించారని పలువురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్న గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Next Story