వేసవిలో కరెంట్ కి అంతరాయం జరగకుండా చూడాలి : ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి

by Ratna Kumari |

వేసవికాలంలో గ్రామాలలో ఎక్కడైనా కరెంటు సమస్య ఉంటే అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని నిరంతరయంగా సరఫరా చేసే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

వేసవిలో కరెంట్ కి అంతరాయం జరగకుండా చూడాలి : ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి
X

దిశ, తలకొండపల్లి : వేసవికాలంలో గ్రామాలలో ఎక్కడైనా కరెంటు సమస్య ఉంటే అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని నిరంతరయంగా సరఫరా చేసే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని పడకల్ గ్రామంలో సోమవారం సర్పంచ్ డోకుర్ సునీత ప్రభాకర్ రెడ్డితో కలిసి గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నారాయణరెడ్డి సందర్శించారు. అనంతరం డ్వాక్రా మహిళా సంఘం భవన భవనిర్మానానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే అందరూ నేరుగా త‌న‌కు సమాచారం ఇవ్వలేరు కాబట్టి.. ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకురావాలన్నారు.

వారం రోజులు లోపల ట్రాన్స్ కో అధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సూచించారు. పడకల్ గ్రామ అభివృద్ధికి సుమారు కోటి రూపాయల వరకు మంజూరు చేశానని, ప్రజల కోరిక మేరకు బీటీ రోడ్డును వెంటనే ప్యాచ్ వర్క్ చేయిస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, పశువుల ఆసుపత్రి, అండర్ డ్రైనేజీలు, ఇనుప పోల్స్ తొలగించడం వంటి పనులు త్వరలో పూర్తయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు చెరువు మరమ్మతులను చేపట్టడానికి సంబంధిత ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి వేసవి కాలంలో పనులు పూర్తి చేయాలని, వర్షాకాలం వచ్చే లోపల మళ్లీ నాకు సమస్య ఉప్పన్నం కావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాట గీత నరసింహ, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రమాదేవి జగ్గారెడ్డి, మాజీ ఎంపీటీసీలు నరసమ్మ, రమేష్, మాజీ సర్పంచులు రమేష్ యాదవ్, శ్రీశైలం, పీఆర్ఏఈ పరమేష్, ఏపీఎం రామస్వామి, వార్డు సభ్యులు, మహిళా సంఘం సభ్యురాలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story