- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్వేద గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు..
by Batti.Sumithra |
పర్వేద గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి.

X
దిశ, శంకర్పల్లి : పర్వేద గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. పట్టా భూమిలో అనుమతి లేకుండా మట్టిని తీస్తూ జేబులు నింపుకుంటున్నారు. రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారుల అనుమతి లేకుండా గత 15 -20 రోజుల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జేసీబీల సహాయంతో రాత్రింబవళ్లు మట్టిని తీసి పెద్ద పెద్ద లారీలలో చేవెళ్ల మండలం, తంగడపల్లి గ్రామంలోని వెంచర్ కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టా భూముల్లో సైతం రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారుల అనుమతితోనే కొద్దిపాటిలోతు మట్టిని తీయాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు ఇదేమి పట్టించుకోకుండా అధికారుల కళ్ళుగప్పి జేసీబీ సహాయంతో పెద్ద పెద్ద గుంతలు తీసి మట్టినితోడి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారులు ఇప్పటికైనా అక్రమంగా మట్టి తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






