- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటీసులు ఇవ్వరు.. కూల్చివేతలు చేయరు
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూరు డివిజన్‌లలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. సాగర్ హైవేకు ఇరువైపులా వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.

దిశ, తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూరు డివిజన్‌లలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. సాగర్ హైవేకు ఇరువైపులా వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని అదునుగా భావించి కొందరు అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఎన్నో బహుళ అంతస్తులు, సెల్లార్, షెడ్ నిర్మాణాలు చేపడుతున్నారు. సాగర్ హైవేకు అనుకొని ఉన్న దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన దాదాపు 25 ఫీట్ల ఎత్తులో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ భారీ షెడ్ నిర్మిస్తున్నారు. బ్రాహ్మణపల్లి నుంచి తొర్రూరు వెళ్లే దారిలో రంగనాయకుల గుట్ట వద్ద అనుమతులు లేకుండా గోడౌన్ నిర్మిస్తున్నారు. గతంలో ఈ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆపారు.
ప్రస్తుతం అక్రమ నిర్మాణా దారులు బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంజాపూర్ నుంచి తొర్రూరు వెళ్లే దారిలో అనుమతులు లేకుండా మరో షెడ్ నిర్మిస్తున్నారు. దీంతో సర్కిల్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇవన్నీ సర్కిల్ డీసీ, టౌన్ ప్లానింగ్ అధికారుల కళ్లకు కనపడినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు అందినా కనీసం నోటీసులు ఇవ్వరు.. చర్యలు తీసుకోరు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం అటు వైపు చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటో అధికారులే చెప్పాలని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులకు అధిక మొత్తంలో ముడుపులు అందుతున్నాయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆదిభట్ల సర్కిల్ అధికారులు అక్రమ నిర్మాణాలు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.






