- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘111’కు తూట్లు.. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
111 జీవోకు తూట్లు పొడుస్తున్న అక్రమ నిర్మాణదారులు నిర్మాణాలు ఆపడానికి దమ్ముంటే ముందుకు రావాలని అధికారులకు సవాలు విసురుతున్న అక్రమ నిర్మాణదారులు..

దిశ, మొయినాబాద్: 111 జీవోకు తూట్లు పొడుస్తున్న అక్రమ నిర్మాణదారులు నిర్మాణాలు ఆపడానికి దమ్ముంటే ముందుకు రావాలని అధికారులకు సవాలు విసురుతున్న అక్రమ నిర్మాణదారులు.. స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా నోటీసులతో కాలయాపన చేస్తున్నారని, 111 జీవోలో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని అధికారులకు తెలియదా అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 10,11, 149 సర్వే నంబర్లలో 111 జీవోకు విరుద్ధంగా అక్రమణ భవనాలు నిర్మిస్తున్నారు.
అడ్డుకోవలసిన అధికారులు చోద్యం చూస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నాటి ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో ఇంకా అస్తిత్వంలోనే ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం విస్మయం గొలుపుతున్నది. హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలో 111 జీవో పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకొని మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ పరిధిలోని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలకు విరుద్ధంగా చేపడితే అధికారులు తక్షణమే కూల్చివేయాలి. కానీ మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ పరిధిలో అలా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






