'హైదరాబాద్ లో హిమాలయాలు'

by Ratna Kumari |

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది.

హైదరాబాద్ లో హిమాలయాలు
X

దిశ, శంషాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది. శంషాబాద్-నాదర్ గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మార్గం వడగళ్లతో నిండిపోవడంతో అచ్చం కశ్మీర్‌ను తలపించేలా మంచు కురిసిన భ్రమ కలిగించింది. ఈ అరుదైన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, "హైదరాబాద్ హిమాలయాలు" అంటూ అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోడ్లన్నీ తెల్లటి మంచు ముక్కలతో నిండిపోవడం చూసి వాహనదారులు విస్మయానికి, ఆనందానికి గురయ్యారు. రోడ్డు వెళ్లే వాహనదారులు కొద్దిసేపు ఆగి మంచులో ఆడుకుంటూ సేద తీరారు. చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. చాలామంది తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Next Story