ఎంత మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసిందో చెప్పాలి : ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పిందని, నేటికి ఎంతమంది మహిళలను కోటీశ్వరులు చేసిందో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

ఎంత మంది  మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసిందో చెప్పాలి : ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పిందని, నేటికి ఎంతమంది మహిళలను కోటీశ్వరులు చేసిందో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. గురువారం బాలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ రంగం చూసినా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి , రెవెన్యూ అధికారులు, మీర్ పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శేఖర్ రెడ్డి, సిల్వరి సాంబ శివ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story