- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపంతో ఇల్లు దగ్ధం
by Ratna Kumari |
దీపం కాలిపోయి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన శనివారం యాలాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, యాలాల : దీపం కాలిపోయి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన శనివారం యాలాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల గ్రామానికి చెందిన గడ్డమీదు సాయిలు, ఆయన భార్య సత్యమ్మ, తల్లి ఎల్లమ్మలు కలిసి వారి ఇంట్లో నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం వేళలో ఇంట్లో ఎవరు లేని సమయంలో అకస్మాత్తుగా ఇంట్లో నుంచి పొగలు వచ్చాయి. ఇంట్లో దేవుని దగ్గర పెట్టిన దీపం కాలిపోవడం వల్లే నిప్పంటుకొని ఇల్లు కాలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై సంఘటన స్థలానికి ఎస్సై విట్టల్ రెడ్డి, తహశీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శ్రీనిజ, గ్రామ సర్పంచ్ శివయ్య లు సందర్శించారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






