అనుకూలించని చోట ఆశలు గల్లంతు

by Thanuru Gopichand |

కొందరు ఆశావహులకు అందని ద్రాక్షగా మారిన రిజర్వేషన్లు!

అనుకూలించని చోట ఆశలు గల్లంతు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు ప్రకటించిన రిజర్వేషన్లు నేతల తలరాతలను తారుమారు చేశాయి. ప్రస్తుతం కొత్తూరు మినహా ఆమన్‌ గల్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌, శంకర్‌ పల్లి, షాద్‌ నగర్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రస్తుత రిజర్వేషన్లు కొందరికి అనుకూలంగా ఉన్నా.. ఎన్నో ఆశలతో ఇన్నేళ్లుగా ఇటు పార్టీ కోసం, అటు ప్రజల కోసం శ్రమించిన అనేక మంది ఆశలు గల్లంతయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలించని చోట పోటీపై కొందరు ఆశలు వదులుకున్నారు. తమకు కాకపోయినా కనీసం మహిళా రిజర్వేషన్లలో భార్య లేదా తల్లిని పోటీకి దింపాలనుకునే వారికి భంగపాటు ఎదురైంది. చైర్మన్‌ స్థానాల్లో మహిళలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోగా.. వార్డుల్లో మాత్రం మహిళలకు 68 స్థానాలను కేటాయించారు

పెరగనున్న బీసీల ప్రాతినిథ్యం..

రంగారెడ్డి జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 138 వార్డులు ఉన్నాయి. వాటిలో ఎస్సీలకు 25, ఎస్టీలకు 10, బీసీలకు 33, జనరల్‌ కు 70 వార్డులు రిజర్వ్‌ అయ్యాయి. జనరల్‌ కు కేటాయించిన వార్డుల్లో 42 వార్డులను మహిళలకు కేటాయించారు. దీంతో మొత్తంగా మహిళలకే 68 వార్డులను కేటాయించినట్లయింది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సత్తా చాటారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ బీసీలు జనరల్‌ స్థానాల్లో పోటీ పడనుండడంతో గతంతో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీల్లో బీసీల ప్రానినిథ్యం పెరిగే అవకాశాలున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో చైర్‌ పర్సన్ల రిజర్వేషన్లు ఇలా..

మున్సిపాలిటీ - రిజర్వేషన్‌

ఆమన్‌ గల్‌ - జనరల్‌

చేవెళ్ల - జనరల్‌

ఇబ్రహీంపట్నం- జనరల్‌

శంకర్‌ పల్లి - జనరల్‌

కొత్తూరు - జనరల్‌

షాద్‌ నగర్‌ - బీసీ జనరల్‌

మొయినాబాద్‌- ఎస్సీ జనరల్‌

రంగారెడ్డి జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు ఇలా..

మున్సిపాలిటీ : ఆమన్‌ గల్‌

మొత్తం వార్డులు : 15

ఎస్టీ -జనరల్‌ - 6,7 వార్డులు, మహిళలు -11, 13

ఎస్సీ - జనరల్‌ - 8వ వార్డు, మహిళ - 2వ వార్డు

బీసీ - జనరల్‌ : 12వ వార్డు

జనరల్‌ - మహిళ : 1, 3, 10, 15వ వార్డులు

అన్‌ రిజర్వ్‌ : 4, 5, 9, 14వ వార్డులు

మున్సిపాలిటీ : చేవెళ్ల

మొత్తం వార్డులు : 18

ఎస్టీ - జనరల్‌ : 17వ వార్డు

ఎస్సీ - జనరల్‌ : 9, 14వ వార్డులు, మహిళ : 2వ వార్డు

బీసీ - జనరల్‌ : 1, 10, 13వ వార్డులు, మహిళ : 3. 18వ వార్డులు

జనరల్‌ - మహిళ : 4, 6, 7, 12, 15, 16వ వార్డులు

అన్‌ రిజర్వ్ - 6, 8, 11వ వార్డులు

మున్సిపాలిటీ : ఇబ్రహీంపట్నం

మొత్తం వార్డులు : 24

ఎస్టీ- జనరల్‌ : 8వ వార్డు

ఎస్సీ - జనరల్‌ : 12, 21, 24వ వార్డులు, మహిళ : 11, 20, 22వ వార్డులు

బీసీ - జనరల్‌ : 2, 13, 15వ వార్డులు, మహిళ : 6, 23వ వార్డులు

జనరల్‌ - మహిళ : 1, 5, 10, 14, 16, 17, 18వ వార్డులు

అన్‌ రిజర్వ్ : 3, 4, 7, 9, 19వ వార్డులు

మున్సిపాలిటీ : మొయినాబాద్‌

మొత్తం వార్డులు : 26

ఎస్టీ - జనరల్‌ : 23వ వార్డు

ఎస్సీ - జనరల్‌ : 4, 6, 11, 14వ వార్డులు, మహిళ - 3, 16, 20వ వార్డులు

బీసీ - జనరల్‌ : 8, 19, 24వ వార్డులు, మహిళ : 1, 2వ వార్డులు

జనరల్‌ - మహిళ : 10, 13, 15, 17, 18, 21, 25, 26వ వార్డులు

అన్‌ రిజర్వ్ : 5, 7, 9, 12, 22వ వార్డులు

మున్సిపాలిటీ : షాద్‌ నగర్‌

మొత్తం వార్డులు : 28

ఎస్టీ - జనరల్‌ : 6వ వార్డు

ఎస్సీ - జనరల్‌ : 26వ వార్డు, మహిళ : 5వ వార్డు

బీసీ - జనరల్‌ : 2, 3, 7, 8, 9, 25 వార్డులు, మహిళ : 10, 15, 16, 18, 28 వార్డులు

జనరల్‌ - మహిళ : 4, 11, 13, 17, 19, 21, 22, 24 వార్డులు

అన్‌ రిజర్వ్ : 1, 12, 14, 20, 23, 27 వార్డులు

మున్సిపాలిటీ : శంకర్‌ పల్లి

మొత్తం వార్డులు : 15

ఎస్టీ - జనరల్‌ : 9వ వార్డు

ఎస్సీ - జనరల్‌ : 1, 7 వార్డులు, మహిళ : 6వ వార్డు

బీసీ - జనరల్‌ : 5, 13 వార్డులు, మహిళ : 3వ వార్డు

జనరల్‌ - మహిళ - 2, 4, 8, 10, 11 వార్డులు

అన్‌ రిజర్వ్ : 12, 14, 15 వార్డులు

Next Story