- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారు వారి పాట..! ఈ ప్రాంతాల్లో భూముల విక్రయానికి సెప్టెంబర్‌లో హెచ్‌ఎండీఏ వేలం
తుర్కయంజాల్ లేఅవుట్ లోని 600 చ.గజాల నుంచి 1146 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 12 ప్లాట్లను విక్రయించనున్నారు. వీటికి ప్రారంభ ధర రూ.65 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని లేఅవుట్లలో ప్లాట్లు, ప్రభుత్వ భూములను వేలం వేయడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. వేలానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. గతంలో ఉప్పల్, కోకాపేట్, బుద్వేల్, హయత్ నగర్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో విజయవంతంగా ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించి ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ సారి కూడా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ స్థలాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని తుర్కఎంజాల్, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్లను వేలం వేయనున్నారు. వీటితోపాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సైతం విక్రయించాని నిర్ణయించారు.
సర్కార్ ధర రూ.65వేలు..
తుర్కయంజాల్ లేఅవుట్ లోని 600 చ.గజాల నుంచి 1146 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 12 ప్లాట్లను విక్రయించనున్నారు. వీటికి ప్రారంభ ధర రూ.65 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీంతోపాటు బాచుపల్లి లేఅవుట్ లోని 266.67 చ.గజాల నుంచి 499.96 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 70 ప్లాట్లను సైతం విక్రయించనున్నారు. వీటికి ప్రభుత్వం ధర రూ.70వేలుగా నిర్ణయించింది. ఈ ప్లాట్ల వేలంలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, అడ్వాన్స్ చెల్లించడానికి 16 సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చారు. 17వ తేదిన ఈ-వేలం నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ భూముల విక్రయాలు
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను సైతం విక్రయించడానికి హెచ్ఎండీఏ షెడ్యూల్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాల్లో 4 ప్రాంతాలు, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 7 ప్రాంతాల్లో భూములను విక్రయించనున్నారు.
మూడు రోజులపాటు ఈ-వేలం..
లేఅవుట్లలోని ప్లాట్లతోపాటు 11పార్శిల్స్ భూములను విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఈ-వేలం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి తుర్కఎంజాల్ లేఅవుట్ లోని ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు 16సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటు 17వ తేదిన ఈ-వేలం నిర్వహించనున్నారు. బాచుపల్లి లేఅవుట్ లోని ప్లాట్ల వేలంలో 17సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశమివ్వడంతోపాటు 18న వేలం నిర్వహించనున్నారు. భూముల వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 18సెప్టెంబర్ చివరి తేదిగా ప్రకటించిన హెచ్ఎండీఏ 19వ తేదిన ఈ-వేలం నిర్వహించాలని నిర్ణయించింది.






