ఉద్యమకారులకు గుర్తింపు ఏది..?

by Disha Web Desk 20 |
ఉద్యమకారులకు గుర్తింపు ఏది..?
X

దిశ, తాండూరు రూరల్ : సారూ.. ఉద్యమకారులు యాదిలేరా ? ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏండ్లు గడిచినా.. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేర లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సమాజం ఏకమై కొట్లాడింది. కానీ, నీళ్ల పేరుతో సర్కారు పెద్దలు జేబులు నింపుకుంటున్నారు. ప్రాజెక్టులకు అవసరమైన దానికంటే వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచుతూ నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు. ఇక స్టూడెంట్లు, నిరుద్యోగులు తమ చదువులు, జీవితాలను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నారు.సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు. ఇప్పుడు వారి గోస ఎవరికీ పట్టడం లేదు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు వారు అసలు కనిపించడం లేదని కొందరు వాదనలు. తాండూరు కారు పార్టీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎవరికి వారు యమునా తీరులాగా గ్రూప్ రాజకీయాలు చేయడంతో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించలేకపోతుందని కొందరు వాపోతున్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కొందరు వ్యక్తుల ఆవేదన. ఉద్యమంలో పోరాటాలు చేసిన వారిని కాదని సంబంధం లేని వ్యక్తులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు పొందిన నేతలు పార్టీ పటిష్టతకు పని చేయడం లేదని, దీని ఫలితంగా పార్టీలో అసంతృప్తి నీవురుగప్పిన నిప్పులా ఉందని ఆ పార్టీకి పలువురు నేతలు వ్యాఖ్యనిస్తున్నారు.

రోడ్డున పడ్డ ఉద్యమకారులు..!

తెలంగాణ సాధించుకునేందుకు భార్యాబిడ్డలు కుటుంబాలను వదిలి ఎన్నో కేసులలో ఇరుక్కొని ఆర్థికంగా నష్టపోయి తెలంగాణ సాధించుకుంటే తమ పిల్లల భవిష్యత్తు, తమ భవిష్యత్తు బంగారమయమైతుందని ఆశతో ఎంతో కష్టనష్టాలకు వచ్చినా ఉద్యమకారులు నేడు తాండూరు నియోజకవర్గంలో ఎవరు లేని అనాధగా మిగిలిపోయారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కూడా ఉద్యోగాలు లేవు. దీంతో ఉపాధి పరువైంది. కుటుంబ పోషణ కోసం రోడ్డు పడుతున్న రోడ్డున పడ్డామన్నారు. బీఆర్ఎస్ అంటే ఒకటే పార్టీగా ఉన్న దానిని రెండు వర్గాలుగా విభజించి ఒక వర్గానికి న్యాయం చేస్తూ ఇంకో వర్గాన్ని అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకే పార్టీగా అందరికీ సమాన హోదా కల్పిస్తే తమ అందరం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. ఇప్పటికైనా పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు నామినేట్ పదవులు ఇవ్వకుండా ఉద్యమకారులను గుర్తించి నామినేట్ పదవులు, గౌరవం ఇవ్వగలరని పాల్గొని వ్యక్తులు కోరుతున్నారు.

ఉద్యమ కారులకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు..

తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధనకై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ రాజకీయ పార్టిగా ఆవిర్భాభించాక పదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఉద్యమకారులకు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి అవమానలే ఎదుర్కొనే దుస్థితి నెలకొందని పలువురు వాదనలు వినిపిస్తున్నాయి. నాటి ఉద్యమం నుంచి నేటివరకు ఉద్యమకారులకు టీఆరెస్ పార్టీలో సమూచిత స్థానం, గౌరవం లభించలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు ఇచ్చారని, వారికే గౌరవం ఇచ్చారు తప్ప, పార్టీకోసం పని చేసిన వారికి ప్రధాన్యత కల్పించలేదని కొందరు ఆరోపించారు. పదేళ్లగా అధికార బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తనకు కనీసం గుర్తింపు ఇవ్వలేదని, అవమానలను ఎదుర్కొని కేవలం కార్యకర్తలాగే బిఆర్ఎస్ లో కొనసాగిన తప్ప ఏనాడూ ఎలాంటి పదవులను ఆశించలేదని కొందరి వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ పనిచేసిన వారికి కాకుండా వ్యక్తిగత వ్యక్తులను పొగిడిన వారికే ప్రజా ప్రతినిధులను, వారి పీ ఏ లను జొకితే తప్ప పదవులు రావని కొందరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు.

ఉద్యమకారుల అసంతృప్తి...!

తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన ఉద్యమకారులు టిఆర్ఎస్ పై అసంతృప్తిలోనే ఉన్నారు. అది నుంచి అన్ని తామై తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారు. తరువాత టి అర్.ఎస్ ప్రభుత్వ ఏర్పడి కాలం సైతం పూర్తి అవుతుంది. రెండో దఫా ప్రభుత్వం పీరియడ్ సైతం దగ్గర పడింది.. దీంతో తమ ఆశలు అడియాశలే అని భావించి జెండా ఎత్తే పనిలో పడుతున్నారు. పార్టీ పరంగా పదవులు లేకపోయినా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు ఉంటుందని ఆశాభావం లో ఉన్నారు ఇతర పార్టీలోని వారు లభిస్తుందని ఆశ తో పనిచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవ దఫాలోను పిరియడ్ పూర్తి కావడంతో ఉద్యమకారులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తివాదులు బిఆర్ఎస్ కు సమస్యగా మారనున్నారని స్పష్టం అవుతుంది.

బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నరు...!

త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఉద్యమ కారిణిలకు సరైన గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాటి ఉద్యమనేత కేసీఆర్ పిలుపు మేరకు పురుషులతో సమానంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించామని.. సాధించిన తెలంగాణలో ఉద్యమకారులకు స్థానం లేకపోవడం బాధాకరమన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన ప్రార్ధన ఇవ్వాలన్నారు. ఉద్యమకారుడు సంజీవ్ గౌడ్ రెడ్డి ఘనపూర్ గ్రామం ఉద్యమంకోసం రక్తం ధార పోశాను..! మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత లేదని ఉద్యమకారుడు ఆవేదన చెందారు.పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు ఇచ్చారని, వారికే గౌరవం ఇచ్చారు తప్ప పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత కల్పించాలేదని ఆయన ఆరోపించారు. ఉద్యమం కోసం తాము రక్తం ధార పోశామని తెలంగాణ వచ్చాక తమకు గుర్తింపు లేదని ఉద్యమకారుడు అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యమకారుడు కశింపాషా క్యాద్గిర్ గ్రామం.


Next Story

Most Viewed