- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమతామూర్తి కేంద్రంలో వైభవంగా జగన్నాథుని రథోత్సవం
by Taduka Kalyani |
ముచింతల్ లోని సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రంలో గురువారం జగన్నాథుని రథోత్సవం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు.

X
దిశ, శంషాబాద్: ముచింతల్ లోని సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రంలో గురువారం జగన్నాథుని రథోత్సవం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. పూరి జగన్నాథ సంప్రదాయాన్ని తలపించేలా నిర్వహించిన ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీరామనగరం భక్తజన సంద్రంగా మారింది. బాలభద్ర, సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని సుందరంగా అలంకరించి దివ్య రథంపై అధిష్టింపజేశారు. భక్తుల జయజయధ్వానాలు, భజనలు, మంగళవాయిద్యాల మధ్య రథోత్సవం ఘనంగా సాగగా, చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తులు రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో ఆశ్రమ నిర్వాహకులు ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Next Story






