- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

దిశ, శంషాబాద్ : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శంషాబాద్‌లో రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9,10 జరిగే గీత పనివారల సంఘం 65వ వార్షికోత్సవం, తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అస్థిర పరచాలని చూస్తుందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని మండిపడ్డారు. సూటు బూటు వేసుకొని నరేంద్ర మోడీ చెప్పే మాటలకు విలువ లేదని ఆయన అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి కార్పోరేట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెడుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీల పేరుతో ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలోకి లాక్కోవడానికి కుట్రలు చేస్తున్నడని తీవ్రంగా మండిపడ్డారు. రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహిస్తామని, ఇల్లు, భూమిలేని వారికి కమ్యూనిస్టు పార్టీ అండ దండ అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండికారి రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి, సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, సయ్యద్ అఫ్సర్, కావలి నరసింహ, ఓరుగంటి యాదయ్య, జైపాల్ రెడ్డి, చందు,రామస్వామి, జంగయ్య, శ్రీను, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






