- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలసాయిబాబా భూములపై ప్రభుత్వం బ్యాక్ స్టెప్
బాలసాయిబాబా భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ భూముల వ్యవహారంపై ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరుతుంది.

దిశ, శేరిలింగంపల్లి: బాలసాయిబాబా భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వెనక్కి తగ్గింది. ఈ భూముల వ్యవహారంపై ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరుతుంది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో సర్వే నంబర్ 105 నుంచి 108లో బాలసాయిబాబా ట్రస్ట్ (Bala Sai Baba Trust) పేరుపై 1990లో రిజిస్టర్ అయిన 42.03 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను ట్రస్ట్ పేరున క్రమబద్ధీకరిస్తూ 2005లో అప్పటి ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ట్రస్ట్ భూముల్లో అభివృద్ధి ఒప్పందానికి అనుమతించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ 2013లో మేనేజింగ్ ట్రస్ట్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత భూములకు సంబంధించి బహి రంగ వేలానికి విధివిధానాలు రూపొందించాలని ప్రైవేటు సంస్థ భూపతి అసోసియేట్స్‌కు అప్పగించారు. దీనిని సవాల్ చేస్తూ పిల్, అలాగే మరో 24 రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. మరోవైపు కొండాపూర్ సర్వే నెంబర్ 105 నుంచి 108 వరకు గల 42.03 ఎకరాల బాలసాయిబాబా భూములు తమవేనంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వాదిస్తోంది. దీనిపై విచారణ జరిపి ఈ నెల 9 వరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదని సమాచారం.
మరోవైపు ఈ భూములపై తెలంగాణకు ఎలాంటి అధికారం లేదని.. చట్టప్రకారం బాలసాయిబాబా ట్రస్ట్ కర్నూల్‌లో రిజిస్టర్ అయినందున భూముల నిర్వహణ తమదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ నెల 9 వరకు గడువు నిర్దేశించినా తెలంగాణ ప్రభుత్వం దీనిపై కౌంటర్ వేయకపోవడంతో నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కొండాపూర్‌లోని బాలసాయిబాబా భూములను వదులుకుంటుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను బ్రీఫ్ నో టు అడగగా ఇప్పటికే సమర్పించామని, అది ఏజీ లెవల్‌లో ఉందని శేరిలింగంపల్లి తహశీల్దార్ వెంకారెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారం కాబట్టి తాను మాట్లాడలేనని స్పష్టం చేశారు.






