రూ.1000 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పెద్దపీట

by Taduka Kalyani |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యా సంవత్సరం సుమారు 1000 కోట్లతో టెస్ట్ బుక్కులు, నోట్ బుక్స్, రెండు జతల డ్రెస్సులు, తదితర సామాగ్రిల కొనుగోలు కోసం ఏకకాలంలో విడుదల చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ నెంబర్ చారకొండ వెంకటేష్ అన్నారు.

రూ.1000 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పెద్దపీట
X

దిశ, తలకొండపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో కటిక పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూల్ లకు, కాలేజీలలో చదువుకుంటున్నారని, ఇలాంటి పేద పిల్లలలకు ఇబ్బందులు ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యా సంవత్సరం సుమారు 1000 కోట్లతో టెస్ట్ బుక్కులు, నోట్ బుక్స్, రెండు జతల డ్రెస్సులు, తదితర సామాగ్రిల కొనుగోలు కోసం ఏకకాలంలో విడుదల చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ నెంబర్ చారకొండ వెంకటేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వెల్జాల్ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మంజూరు చేయడంతో సోమవారం పాఠశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాలను ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యా కమిషన్ సభ్యులు డా. చారకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు నసిన సుల్తానా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డా. చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ ...

గ్రామీణ ప్రాంతాల్లోని పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గతంలో విద్యావ్యవస్థ నాశనమైందని, కులాల వారీగా విభజించి విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల మరింత దూరం వ్యత్యాసం పెరిగి సమాజానికి నష్టం జరుగుతుందని ప్రజా ప్రభుత్వం గుర్తించి, విద్యా వ్యవస్థ పై సమూలమైన మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని వెంకటేష్ గుర్తు చేశారు. జిల్లాలో విద్యాపరంగా గద్వాల ప్రాంతం చాలా వెనుకబడిందని, ప్రక్కనున్న ఇర్విన్ గ్రామంలో ప్రతి సంవత్సరం సుమారు 20 మంది విద్యార్థులు ఐఐటి ,ఎన్ఐటిలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని గుర్తు చేశారు. అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంకితభావంతో, ప్రత్యేక చొరవనే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. మన రాష్ట్రంలో 22 రకాల స్కూల్స్ కొనసాగుతున్న కూడా, ప్రతి పిల్లవాడి భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వెల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను, ప్రధానోపాధ్యాయురాలిని ఘనంగా సన్మానించి మెమెంటోలను, నగదు బహుమతులను వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వానరాశి రాములమ్మ, ఉపసర్పంచ్ శివ విజయలక్ష్మి–విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి, ఎంఈఓ చాప్లా నాయక్, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు నసీమా సుల్తానా, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, మాజీ ఎంపీపీ సి.ఎల్. శ్రీనివాస్ యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎ. అంజయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ముజీబూర్ రహమాన్, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ ఎ. సదానందం గౌడ్, మాజీ ఎంపీటీసీలు జి. శ్రీనివాసమూర్తి, ఎం. అంబాజీ, మాజీ ఉపసర్పంచులు బి. నర్సింలు, అజీజ్, మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎం.డి. ఆరిఫ్, పి. అశోక్ బాబు, టి. కృష్ణయ్య గౌడ్, రిపోర్టర్ విష్ణువర్ధన్ యాదవ్, వానరాశి వెంకటేష్, సి. లింగం యాదవ్, పులిజాల విష్ణు, టి. రాఘవేందర్ గౌడ్, ఎ. శ్రీశైలం గౌడ్, చింతకాయల రాము, అంతారం, చౌదర్‌పల్లి, మదాయపల్లి గ్రామాల సర్పంచులు, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పి. రమేష్ యాదవ్, వివిధ గ్రామాల నాయకులు, యువజన ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story