రూ.40 కోట్ల విలువైన స్థలం స్వాహా..!

by Nallavelli.Anjaneyulu |

అది ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. అసోసియేషన్ నిర్వాహకులు ఫ్లాట్స్ యజమానులు. అపార్ట్మెంట్ కు సంబంధించిన బాగోగులు చూసుకోవాలి. ఇక్కడ ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు బరి తెగించారు.

రూ.40 కోట్ల విలువైన  స్థలం స్వాహా..!
X

దిశ, గండిపేట : అది ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. అసోసియేషన్ నిర్వాహకులు ఫ్లాట్స్ యజమానులు. అపార్ట్మెంట్ కు సంబంధించిన బాగోగులు చూసుకోవాలి. ఇక్కడ ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు బరి తెగించారు. తమ అపార్ట్మెంట్ కు ఆనుకొని ఉన్న సుమారు 40 నుంచి 50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. దానిని బయటికి కనిపించకుండా రేకులు అడ్డుగా పెట్టారు. ఏముంది కోట్లు విలువ చేసే స్థలాన్ని విక్రయించి జేబులు నింపేసుకుందామని ప్లాన్ చేశారు. ఈ వ్యవహారం అంతా గండిపేట మండలం నార్సింగి సర్కిల్ పరిధిలోని పుప్పాలగూడలో జరుగుతోంది. పుప్పాలగూడలోని సర్వే నంబర్ 252లో 2000 గజాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రధాన రహదారిపై ఉన్న గేటెడ్ కమ్యూనిటీ స్కైలా అపార్ట్మెంట్ కు ఆనుకొని ఉంది.

స్కైలా గేటెడ్ కమ్యూనిటీలో వందల కొలది ఫ్లాట్లు నార్సింగి నుంచి మణికొండ వెళ్లే ప్రధాన రహదారి పై స్కైలా గేటెడ్ కమ్యూనిటీ భారీ స్థాయిలో అపార్ట్మెంట్ ఉంది. ఇది కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది. వందల కొలది ఫ్లాట్లు ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో అన్ని సౌకర్యాలున్నాయి. కమ్యూనిటీలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు. ఐటీ రంగానికి చెందిన ఎక్కువ మంది స్కైలా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. స్కైలా అపార్ట్మెంట్ కు ఆనుకొని ప్రభుత్వానికి చెందిన 2000 గజాల భూమి ఉంది. ఈ విషయాన్ని అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మెల్లగా దానిని కబ్జా చేయడం ప్రారంభించారు. దర్జాగా ఆ స్థలం కనిపించకుండా దానికి రేకులు అడ్డంగా పెట్టారు. మణికొండ, పుప్పాలగూడ ప్రాంతంలో గజం జాగా సుమారు 2 లక్షలు ఉంటుంది. ప్రభుత్వానికి చెందిన 2000 గజాలను అమ్మేసి దర్జాగా కోట్లు గడించవచ్చని స్కైలాగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

అసోసియేషన్ లోని కొందరు సభ్యులు ప్రభుత్వ భూమిని దర్జాగా కొట్టేసేందుకు పథకం రచించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. సదరు ప్రభుత్వ స్థలానికి ఎలాంటి రోడ్డు లేదని రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అసోసియేషన్ నిర్వాహకుల్లో కొందరు కుట్రకు తెర తీశారు. సుమారు 40-50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అమ్మేసి కోట్లకు పడగలెత్తవచ్చని భావించారు. స్కైలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు. 2000 గజాలు ప్రభుత్వ స్థలం అని తెలిసినా కూడా అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులు దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. ఈ నేపథ్యంలో దానిని దర్జాగా కొట్టేసేందుకు ప్లాన్ చేశారు.

అది ప్ర‌భుత్వ స్థ‌ల‌మే : త‌హ‌శీల్దార్

స్కైలా గేటేడ్ క‌మ్యూనిటీ అపార్టుమెంట్ కి ఆనుకొని 2వేల గ‌జాల ప్ర‌భుత్వ స్థ‌లం ఉంద‌ని గండిపేట మండ‌లం త‌హ‌శీల్దార్ శ్రీనివాస్ రెడ్డి దిశ ప్ర‌తినిధికి తెలిపారు. ఈ భూమికి దారి లేద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో స్కైలా గేటెడ్ క‌మ్యూనిటీ అపార్టుమెంట్ లోని ప్ర‌భుత్వ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకొని దానిని వేలం వేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ భూమి ఇత‌రుల పాలు కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story