హైదరాబాద్ ప్రజలకు శుభవార్త

by Ratna Kumari |

ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతీయేటా కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనంలో గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

హైదరాబాద్ ప్రజలకు  శుభవార్త
X

దిశ, రాజేంద్రనగర్ : ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతీయేటా కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనంలో గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. శనివారం ద్రాక్ష ఫెస్టివల్ ను కొండా లక్ష్మణ్ బాపూజీ వైస్ ఛాన్స్ ల‌ర్ దండా రాజిరెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లో ఉన్న ద్రాక్ష పరిశోధన కేంద్రం 7 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక తోటను ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లే వారు ఎంత కావాలంటే అంత ద్రాక్ష పండ్లు తినవచ్చు ఒకే చోట 59 రకాల ద్రాక్ష పండ్లను కొనుగోలు చేయవచ్చు. కేవలం 10 రోజుల పాటు మాత్రమే కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే ప్రజలకు అనుమతిస్తారు.

మీ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి వెళ్లి తోటలో తిరుగుతూ, మీకు నచ్చిన ద్రాక్షలను బుట్టలో సేకరించి చివరలో కౌంటర్ లో వైట్ చేయించి కొనుగోలు చేసే ఆనందాన్ని అనుభవించవచ్చు. భారతదేశం మొత్తం లో పండించే 59 రకాల ద్రాక్షలను ఒకే చోట చూడడం చాలా అరుదైన విషయం. ఒకప్పుడు 1970 నుంచి 1983 వరకు హైదరాబాద్ ద్రాక్షల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. అప్పట్లో దాదాపు 15,000 ఎకరాల భూమిలో ద్రాక్ష సాగు ఉండేది. రియల్ ఎస్టేట్ పెరుగుదల, ప్రభుత్వ సహకారం తగ్గిపోవడం వల్ల 1983 తర్వాత ఈ సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం దాదాపు 400 ఎకరాల భూమిలో మాత్రమే ద్రాక్ష సాగు జరుగుతోంది.

Next Story