శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

by Web Desk |
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది.

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేయడంతో బంగారం సూట్ కేసు లో ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుడు సూట్ కేసు లోపల సపోర్టింగ్ మెటల్ ఫ్రేమ్ లో తీగల రూపంలో దాచి అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 21 లక్షల 66 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed