శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..

by Disha Web Desk 6 |
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
X

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం జెడ్డా నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారం పొడిని మూడు క్యాప్సిల్స్ లోకి అమర్చి ప్రయాణికుడి పురుషాంగం వద్ద అమర్చుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 21 లక్షల 63 వేల 707 రూపాయల విలువ చేసే 403.4 గ్రాముల బంగారం క్యాప్సిల్స్ ను స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Next Story