- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు.

దిశ, షాద్ నగర్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం షాద్‌నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ లో ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ఎ బి కాంప్లెక్స్ నామినేషన్ రాలిని ప్రారంభించి ప్రసంగించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల వలన మున్సిపాలిటీ అభివృద్ధి జరగదని, ఒకసారి బిజెపి కి అవకాశం ఇస్తే షాద్ నగర్ రూపురేఖలే మారుస్తామని అన్నారు. బిజెపి పార్టీ నుంచి 28 వార్డులో అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారందరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రకాష్ రెడ్డి కోరారు.
అనంతరం బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు 75 సంవత్సరాలు గా ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధికి దూరంగా ఉంచారని వారి పాలనలో నేటికీ ఇళ్ళ ను సైతం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,అందే బాబయ్య, మణికొండ రంగయ్య గౌడ్, చెంది మహేందర్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, కక్కునూరి వెంకటేష్ గుప్తా,బిజెపి మండల అధ్యక్షులు చిట్యం లక్ష్మీకాంత్ రెడ్డి అమర పురం నరసింహ, బోయ కురుమయ్య, మోటి శ్రీనివాస్, ఎన్ ప్రవీణ, ఎంకునోల వెంకటేష్, విట్యాల నర్సింలు, పిట్టల సురేష్, రొల్లు రాధిక తదితరులు పాల్గొన్నారు.






