- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా.. టౌన్ ప్లానింగా లేకా లూటీ ప్లానింగా?
భవన నిర్మాణం అనుమతులు ఒకలా తీసుకొని మరో లా నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు టౌన్ ప్లానింగ్ కాస్త లూటీ ప్లానింగ్ గా తయారైందని స్థానికులు విమర్శిస్తున్నారు.

దిశ, మీర్ పేట్: భవన నిర్మాణం అనుమతులు ఒకలా తీసుకొని మరోలా నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు టౌన్ ప్లానింగ్ కాస్త లూటీ ప్లానింగ్ గా తయారైందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తు న గండి పడుతుంది అయినా తమ కు పట్టదనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
జిల్లెలగూడ డివిజన్ గాయత్రి హోమ్స్‌లో ప్రధాన రహదారి పక్కనే జి+2 అనుమతులు తీసుకొని ఆపై మరో అంతస్తు, పెంట్ హౌస్ నిర్మా ణం చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం కనీసం నోటీసులు జారీ చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చందనం చెరువు వద్ద శివ సాయి నగర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. నిత్యం ఆ రహదారిపై నుంచి వెళ్లే అధికారులకు కనిపించకపోవడం విస్మయానికి గురిచేస్తుంది, తూతూ మంత్రం గా నోటీసులుజారీ చేసి చేతులు దులుపుకున్నారు.
అక్రమ నిర్మాణాలను గుర్తిస్తే 21 రోజుల్లో నోటీసులు జారీ చేయాలి కానీ చేయలేదు. అంబేద్కర్ నగర్‌లో, శక్తి నగర్లో జీ+2 అనుమతు లు తీసుకొని ఆపై నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎందుకు చ ర్యలు తీసుకోవడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
కనుసన్నల్లోనే నిర్మాణాలు!
బడంగ్ పేట్ సర్కిల్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదురు ఏసీపీ బడంగ్ పేట్ సర్కిల్, ఆదిభట్ల సర్కి ల్‌తో పాటు నారాయణపేట టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారంలో రెండు రో జులు మాత్రమే బడంగ్ పేట్ సర్కి ల్‌లో విధులు నిర్వహిస్తాడు మరో నాలుగు రోజుల్లో రెండు రోజులు ఆదిభట్లలో మరో రెండు రోజులు నారాయణపేటలో విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చిన రెండు రోజుల్లోనే అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారి చూసీ చూడనట్టు వ్యవహరించడమే అనుమానాలకు ఆజ్యం పోస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ కూడా వారంలో మూడు బడంగ్ పేట్ సర్కిల్ మరో మూడు రోజులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తుంటాడు కానీ సమాచారం కోసం ఫోన్ చేస్తే ఆ అధికారి మాత్రం స్పందించిన దాఖలాలు లేవని మాజీ కార్పొరేట ర్ బహిరంగంగా అంటున్నారు.
చర్యలు ఏవి?
బడంగ్ పేట్ సర్కిల్‌లో కోట్లాది రూ పాయల అవినీతి జరిగిందనీ ఏసీబీ అధికారులు ఇంజినీరింగ్ విభాగం తో పాటు, శానిటేషన్ విభాగంపై చర్యలు తీసుకొని రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు మరో 10 మంది అధికారులు సస్పెండ్ అయి న విషయం తెలుసు. కానీ బడంగ్ పేట్ సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ విభాగంలో 49 అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించామని 21 రో జుల గడిచిన కూడా నోటీసులు జారీ చేయలేదని ఏసీబీ అధికారులు అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కాపాడుతున్నది ఎవరు? అవినీతి జరిగిందని స్పష్టంగా ఏసీబీ అధికారులు కుండబద్దలు కొట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనీ అవినీతి జరిగిన శాఖపై దృష్టి సా రించి ఉన్నతాధికారులు చట్టపరమై న చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






