మహిళను మోసం చేసిన ముఠా అరెస్ట్...

by Taduka Kalyani |

ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్‌ల ద్వారా మహిళకు పరిచయమై ఉద్యోగాల పేరుతో మోసాలు, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

మహిళను మోసం చేసిన ముఠా అరెస్ట్...
X

దిశ, రాజేంద్రనగర్ : ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్‌ల ద్వారా మహిళకు పరిచయమై ఉద్యోగాల పేరుతో మోసాలు, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.70 వేల నగదు, బంగారు మంగళసూత్రం, టయోటా ఎటియోస్ కారు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నానికి చెందిన కుడుముల పాండురంగారావు అలియాస్ సన్నీ నాయుడు సోషల్ మీడియా ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకుని, తాను ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కుమారుడినని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమె ఇంటికి వెళ్లి బంగారు మంగళసూత్రాన్ని చోరీ చేసి పరారయ్యాడు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు పాండురంగారావుతో పాటు అతని సహచరుడు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి చోరీ సొత్తు, నగదు, కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే అపరిచితులను నమ్మి వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వవద్దని, ఉద్యోగాల కోసం అధికారిక వేదికలనే ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Next Story