ఆమనగల్లుకు ఫ్యూచర్ పవర్.. ఉనికి కోల్పోతున్న తరుణంలో వరం

by Malleboina Mahesh |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ఆమనగల్లులో పూర్వ సమితికి వరంలా మారింది.

ఆమనగల్లుకు ఫ్యూచర్ పవర్.. ఉనికి కోల్పోతున్న తరుణంలో వరం
X

దిశ, ఆమనగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ఆమనగల్లులో పూర్వ సమితికి వరంలా మారింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2016 కు ముందు ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు ఆమనగల్లు కేంద్ర బిందువుగా ఉండేది. నూతన మండలాల్లో భాగంగా ఆమనగల్లు నుంచి కడ్తాల్‌ను వేరు చేస్తూ నూతన మండలంగా ప్రకటించారు.2016లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి మాడుగుల పీఎస్‌ను, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి పీఎస్‌లను కలపడంతో వ్యాపార కేంద్రంగా ఆమనగల్లు మందగించింది.

ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఆశలు..

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ మహేశ్వరం, మొయినాబాద్, షాద్ నగర్ డీసీపీ స్థాయిలో మూడు జోన్లు, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మహేశ్వరం, మొయినాబాద్, ఆమనగల్లు షాద్ నగర్ ఏసీబీ స్థాయిలో పనిచేస్తాయని నిర్ణయించారు. ఆమనగల్లు ఏసీపీ పరిధిలో ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, కేశంపేట పీఎస్‌లను కేటాయిస్తూ పోలీస్ ఉన్నతాధికారులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. కానీ ఆమనగల్లు పూర్వపు సమితిలోని కడ్తాల్‌ను కూడా ఆమనగల్లు ఏసీపీ పరిధిలో ఉంచాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని కోరడంతో ఆమనగల్లు ఏసీపీ పరిధిలోకి ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల పీఎస్‌లు చేరనున్నాయి.

ఆమనగల్లుకు మహర్దశ..

గత పదేండ్ల కాలంలో ఆమనగల్లును చిన్నాభిన్నం చేశారు. అభివృద్ధిలో పూర్తిగా వెనకబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమనగల్లు పూర్వ సమితికి పూర్వ వైభవం తెస్తాం.- గుర్రం కేశవులు, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్

ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి..

ఏసీపీ కార్యాలయం ఏర్పాటు హర్షణీయం. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఆర్డీవో, ఆర్టీవో కేటాయించాలి. ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆమనగల్లు పట్టణ కేంద్రంలోనే నూతన భవనాలు నిర్మించి వినియోగంలోకి తేవాలి. -పత్యా నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు, ఆమనగల్ బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు

Next Story