- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, శంషాబాద్ : శనివారం జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినిలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని నాణ్యతను పరిశీలించారు. కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినిలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






