- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Food Poison: రాష్ట్రంలో మరో సంచలనం.. బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), వసతి గృహాల్లో (Hostels) ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), వసతి గృహాల్లో (Hostels) ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే నారాయణ పేట జిల్లా (Narayanapet District) పరిధిలోని మాగనూరు (Maganur) ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే. అయితే, ఆ ఘటన మరువక ముందు తాజాగా, వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరు (Tandur) పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన విద్యార్థినులను తాండూరు (Tandur) ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






