హైదరాబాద్- ఆమ్స్‌టర్‌డామ్ మధ్య విమాన సేవలు

by velandi.Saikiran |

కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్- ఆమ్స్‌టర్‌డామ్ షిప్‌హోల్ ఎయిర్‌పోర్ట్ (ఏఎం ఎస్) మధ్య నూతన ప్రత్యక్ష విమాన

హైదరాబాద్- ఆమ్స్‌టర్‌డామ్ మధ్య విమాన సేవలు
X

దిశ, గండిపేట: కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్- ఆమ్స్‌టర్‌డామ్ షిప్‌హోల్ ఎయిర్‌పోర్ట్ (ఏఎం ఎస్) మధ్య నూతన ప్రత్యక్ష విమాన సేవలను బుధవారం ప్రారంభించింది. ఈ కొత్త రూట్‌తో భారత్‌లో నాలుగో గేట్వేను కేఎల్ఎమ్ ప్రారంభించింది.

ప్రారంభ విమానం

KL 874 విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి ఆమ్స్‌టర్‌డామ్ షిప్‌హోల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం ద్వారా ఈ రూట్ అధికారికంగా ప్రారంభమైంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి ఇప్పటికే ఉన్న సేవలకు తోడు, హైదరాబాద్ ఇప్పుడు నాలుగో గేట్వేగా చేరింది. హైదరాబాద్ రూట్ ప్రారంభంతో భారత్–ఆమ్స్‌టర్‌డామ్ కనెక్టివిటీ మరింత బలోపేతమైంది. కేఎల్ఎమ్ గ్లోబల్ నెట్‌వర్క్‌లోని 160కి పైగా గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం లభిస్తుంది.

ఫ్లైట్ షెడ్యూల్


ఈ రూట్‌ను బోయింగ్ 777-200ER నిర్వహిస్తుంది. ఇందులో వరల్డ్ బిజినెస్ క్లాస్‌లో 35 సీట్లు, ప్రీమియం కంఫర్ట్ క్లాస్‌లో 24 సీట్లు, ఎకనమీ క్లాస్‌లో 229 సీట్లు ఉన్నాయి. KL874: హైదరాబాద్ నుంచి 02:20 గంటలకు బయలుదేరి అదే రోజు ఆమ్స్‌టర్‌డామ్‌లో 08:40కు చేరుకుంటుంది.

KL873: ఆమ్స్‌టర్‌డామ్ నుంచి 11:40 గంటలకు బయలుదేరి తర్వాత రోజు 00:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. విమాన టికెట్లు ఇప్పటికే విక్రయానికి అందుబాటులో ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.

ఫ్లయింగ్ బ్లూ మైల్స్ ప్రమోషన్

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఫ్లయింగ్ బ్లూ లాయల్టీ సభ్యుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్‌ను కేఎల్ఎమ్ ప్రారంభించింది. 1 ఆగస్టు – 30 సెప్టెంబర్ 2025 మధ్య టికెట్లు బుక్ చేసుకునే సభ్యులకు అదనపు మైల్స్ లభిస్తాయని తెలిపారు. ఎకనమీ క్లాస్ – 2,000 మైల్స్, ప్రీమియం ఎకనమీ – 5,000 మైల్స్, బిజినెస్ క్లాస్ – 10,000 మైల్స్ అదనంగా, 3X మైల్స్ ప్రమో క్యాంపెయిన్ కింద 27 జూలై – 1 సెప్టెంబర్ 2025లో కొనుగోలు చేసిన టికెట్లపై, 3 సెప్టెంబర్ – 30 నవంబర్ 2025 మధ్య ప్రయాణించే విమానాల కోసం మూడు రెట్లు మైల్స్ పొందవచ్చు. కేఎల్ఎమ్ సిఈఓ మార్టెన్ స్టీనెన్ మాట్లాడుతూ.. “హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఫార్మాస్యూటికల్స్, గ్లోబల్ IT రంగాలు ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్–ఆమ్స్‌టర్‌డామ్ నేరుగా కలవడం ద్వారా భారత్‌తో అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత బలపడుతుందని నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ అన్నారు. జి హెచ్ ఏ ఐ ఎల్ సీఈఓ ప్రదీప్ పాణికర్ మాట్లాడుతూ.. “కేఎల్ఎమ్ నేరుగా హైదరాబాద్ నుంచి ఆమ్స్‌టర్‌డామ్‌కి సేవలు ప్రారంభించడం, దక్షిణ భారత ప్రయాణికులకు యూరప్, ఉత్తర అమెరికా, ఇతర ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ గేట్వేగా నిలబెట్టడంలో ఇది కీలక మైలురాయన్నారు. ప్రయాణికులు ఈ కొత్త సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story