నీట్ పరీక్ష నిర్వహణకు 5 కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

by Kodari Anjali |

నీట్ పరీక్ష నిర్వహణకు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.

నీట్ పరీక్ష నిర్వహణకు 5 కేంద్రాలు ఏర్పాటు:  కలెక్టర్
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలో నీట్ పరీక్ష నిర్వహణకు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నీటి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ దీపక్ తివారి ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు పరీక్ష కేంద్రాలు 1215 విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. 11 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థి ఎలాంటి ఎలెక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.

Next Story