- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ స్తంభానికి అంటుకున్న మంటలు
చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా రోడ్డుపక్కనే నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి అంటుకున్నాయి.

దిశ, మీర్ పేట్ : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ ప్రమాదానికి కారణమైంది. బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని మీర్ పేట్ సిర్లాహిల్స్ ప్రధాన రహదారిపై ఉన్న శ్మశాన వాటిక పక్కనే 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేశారు. ఆ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా రోడ్డుపక్కనే నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది నిర్లక్షం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించకుండా రోడ్డుపైనే నిప్పు పెట్టడంతోనే విద్యుత్ తీగలు మంటలు అంటుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






