పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

by Web Desk |
పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, శంషాబాద్: పోలీసులు సీజ్ చేసిన కార్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం జరిగి నాలుగు వాహనాలు మంటలకు ఆహుతి అయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న వెహికల్ పార్కింగ్ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి పలు కేసులలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలలోని 2 కార్లు, 1 బైక్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో ట్రాక్టర్ ఇంజిన్ పాక్షికంగా కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది కాస్త ఆలస్యమైతే పార్కింగ్ లో వందలాదిశ, శంషాబాద్: పోలీసులు సీజ్ చేసిన కార్ పార్కింగ్ది బైకులు, కార్ లు ఉన్నాయి. మంటలు వ్యాపిస్తే పెను ప్రమాదం ఉండేది. అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story