- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ.. వారధి లేని రైతు బజార్
జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో నిలువ నీడ లేక రైతులు, వినియోగదారు లు తీవ్ర ఇబ్బందుపడుతున్నారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో నిలువ నీడ లేక రైతులు, వినియోగదారు లు తీవ్ర ఇబ్బందుపడుతున్నారు. ఎండాకాలం కావడంతో నీడ లేక, ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే బురదలో కూరగాయలు అమ్ముతున్న రైతులు ఇబ్బందులు పడుతుండగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు కిందపడిపోతున్నారని స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజారు 2013లో ప్రస్తుత స్పీకర్ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతు బజార్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2023లో గత ప్రభుత్వం హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధితోపాటు రైతు బజార్ అభివృద్ధికి రూ.3.20 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. కోటికి పైగా నిధులు ఖర్చు చేసి పిల్లర్లు బేస్మెంట్లు వేసి మధ్యలోనే పనులు నిలిపివేశారు. మధ్యలోనే పనులు నిలిపియడంతో బేస్మెంట్ శిథిలావస్థకు చేరుకొని యథావిధిగా మారిపోయింది. ఇందులోనే రైతులు తాత్కాలికంగా ప్లాస్టిక్ కవర్ వేసుకొని కూరగాయల విక్రయాలు చేస్తున్నారు. గాలివానల బీభత్సాలకు ఆ ఉన్న కవర్లు కొట్టుకుపోయి రైతులు అయోమయానికి గురవుతున్నారు. రైతు బజార్‌లో కనీస సౌకర్యాలు లేకపోయినా నీడ కూడా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వి కారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రైతు బజార్ కు నవాబుపేట్ వికారాబాద్ దారుర్ మండలాల గ్రామాల రైతులు వచ్చి తమ పంటలను విక్రయిస్తుంటారు. రైతు బజార్లో నిర్మాణాలు చేపట్టి వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు, ఎమ్మెల్యే స్పందించి రైతు బజార్లో అభి వృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రణాళికలు పంపాను
- శ్రీనివాస్ ముదిరాజ్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్
వికారాబాద్ రైతు బజార్ నిర్మాణంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు తయారుచేసి జిల్లా కలెక్టర్, మార్కెటింగ్ శాఖకు పంపించడం జరిగింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ మార్కెట్‌తో పాటు రైతుబజార్ అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.






