ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు

by velandi.Saikiran |

ఆయిల్ ఫామ్ ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేష్ అన్నారు. బుధవారము ఆమనగల్లు

ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు
X

దిశ, ఆమనగల్లు : ఆయిల్ ఫామ్ ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేష్ అన్నారు. బుధవారము ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో రైతు వేదికలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి సురేష్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ కు తక్కువ పెట్టుబడి ఉంటుందని, అధిక లాభాలు పొందవచ్చని, ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించేలా ప్రభుత్వం రైతులకు భారీగా రాయితీ అందిస్తుందన్నారు.

1993 ఆయిల్ ఫామ్ చట్టం ప్రకారము రైతులు పంట అమ్ముకోవడంలో రక్షణ కల్పిస్తుందని, జిల్లాకి ప్రభుత్వము వేల్యూ ఆయిల్ అనే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని, నిర్ణయించిన ధర ప్రకారము రైతుల నుండి కంపెనీ పంటను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి సౌమ్య, ఆయిల్ ఫామ్ ఏరియా మేనేజర్ ప్రమో ద్, హెచ్ ఈ ఓ శ్రవణ్ కుమార్, ఏఈఓ భూదేవి, పంచాయతీ కార్యదర్శి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story