- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం: దళారుల చేతిలో వరి ధాన్యం
ప్రభుత్వం యాచారం మండల వ్యాప్తంగా వరి, ధాన్యం కొనుగోలు సెంటర్లను యాచారం, నందివనపర్తి, చింతపట్ల, మంథ న్ గౌరెల్లి, గ్రామాలలో ఏర్పాటు చేసింది. అయితే ఇందులో నామ మాత్రంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

దిశ, యాచారం : రైతన్నలు ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు తక్కువ ధరకే దళారుల పాలవుతోంది. పంటలు చేతికొచ్చిన దశలో వరుస వానలు వెంటాడుతుండడంతో కష్టం నేల పాలవుతుందన్న భయంతో చేసేదేమీ లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడి అయినా మిగులుతుందనే ఉద్దేశంతో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ. 1,730కే అప్పచెప్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా విక్రయాలు
ప్రభుత్వం యాచారం మండల వ్యాప్తంగా వరి, ధాన్యం కొనుగోలు సెంటర్లను యాచారం, నందివనపర్తి, చింతపట్ల, మంథ న్ గౌరెల్లి, గ్రామాలలో ఏర్పాటు చేసింది. అయితే ఇందులో నామమాత్రంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ యాసంగిలో మండల వ్యాప్తంగా నాలుగు వేల ఎకరాలకు పైగానే వరి పంటలను సాగు చేశారు. ప్రతీ రోజు పగలంతా ఎండలు కొడుతూ సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దీంతో ఎక్కడ తమ కష్టం నేల పాలవుతుందోనని ఆ భయం రైతులను వెంటాడుతోంది. 17 లోపే తేమశాతం ఉండాలని ప్రభుత్వ నిబంధన ఉండటం, ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేకపోవడం, తడిసిన ధాన్యంలో తేమ శాతం 24 ఉంటుండటం దళారులకు వరంగా మారింది. పంట పొలాల వద్దనే క్వింటాలకు 5 కిలోల తరుగు తీస్తూ, బస్తాకు రూ. 30 చొప్పున కోత కోస్తూ, క్వింటాల్‌కు రూ. 1,730 మాత్రమే చెల్లిస్తూ దళారులు అందిన కాడికి దోచేస్తున్నారు. దళారులు తక్కువ డబ్బులు ఇచ్చినా.. వెంటనే చెల్లింపులు చేస్తుడటం వల్ల రైతులు వారి వైపే మొగ్గు చూపుతన్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కల్లాలు, కొనుగోలు సెంటర్ల వద్ద మెరుగైన వసతులు కల్పించి ఆదుకోవాలని, అలాగే కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటేనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
55 క్వింటాళ్లను దళారులకు అమ్మాను : సోలేటి హనుమంత్ రెడ్డి, రైతు, నానక్ నగర్
55 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోయాను. ధాన్యాన్ని ఆరబెట్టుకోలేక, వర్షాల భయంతోనే నా పంటను దళారులకు అప్పజెప్పాను. కనీసం పెట్టుబడి డబ్బులు అయినా వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేశాను.
ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలి : మహిపాల్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు
ఆరుకాలం కష్టపడి పండించిన తమ పంటను దళారులకు అమ్మి రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం దళారులపై ఉక్కు పాదం మోపి రైతులను ఆదుకోవాలి. రైతులకు అండగా నిలబడాలి.
కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : రవినాథ్, మండల వ్యవసాయ అధికారి
రైతులు తమ పంటను ధాన్యం కొనుగోలు సెంటర్లలోని అమ్ముకోవాలి. ఇప్పటివరకు 6,800 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాను. ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి రావాలని. వాటిని వెంటనే పరిష్కరిస్తాం.






