- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ నోట్ల హల్చల్.. బెంబేలెత్తుతున్న ప్రజలు
ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ లకు అలవాటు పడి డిజిటల్ పేమెంట్స్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు తమ అవసరాల మేరకు నగదు రూపంలో లావాదేవీలు జరుపుకుంటారు.

దిశ, మర్పల్లి: ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ లకు అలవాటు పడి డిజిటల్ పేమెంట్స్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు తమ అవసరాల మేరకు నగదు రూపంలో లావాదేవీలు జరుపుకుంటారు.ఇదే అదునుగా చూసుకొని కొంత మంది నేరస్థులు దొంగ నోట్లు ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు. గురువారం మండల కేంద్రంలోని బజ్జీల దుకాణం లో వ్యాపారస్తునికి నకిలీ నోటు ఇచ్చారు. వ్యాపారం నిర్వహించే వారిలో వయసు పైబడిన, నిరక్షరాస్యులను చూసి వారిని టార్గెట్ చేసి నకిలీ నోట్లను మారుస్తున్నారు. దీంతో ఆ నోట్లోను తీసుకొని ఏదైనా లావాదేవీ చేసే సమయంలో ఇది నకిలీ నోటు, ఇది నడవదని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింటున్నారు. మరికొందరు బ్యాంకులో వేయడానికి వెళితే బ్యాంక్ అధికారులు ఇది ఫేక్ నోట్ అని కొట్టి ఇస్తున్నారు. అసలు నోటు నకిలి నోటుకు ఏమాత్రం తీసిపోకుండా ముద్రిస్తున్నారు. ఎప్పటికైనా నకిలీ నోట్లపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.






