- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. ఇంతకీ ఏమైందంటే.. ?
నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండల కేంద్రంలో నిర్మించిన తహసిల్దార్ కార్యాలయ నిర్మాణంపై హైకోర్టులో కేసు నమోదయింది.

దిశ, ఆమనగల్లు: నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండల కేంద్రంలో నిర్మించిన తహసిల్దార్ కార్యాలయ నిర్మాణంపై హైకోర్టులో కేసు నమోదయింది. పూర్తి వాదనలు విన్న హైకోర్టు ఏ క్షణమైన తుది తీర్పును వెలువరించనున్నది. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 72,73 లో వెంచర్ ను ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. అందులో కందికంటి సుజాత ఆ వెంచర్ లో ప్లాట్ విక్రయించింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన నూతన మండలం కడ్తాల్ లో నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలని స్థల సేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి,ఎంపీవో లు 72,73సర్వే నెంబర్ లో వెలసిన వెంచర్ లోని 10%ల్యాండ్ లో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం అని గుర్తించి పై అధికారులకు నివేదిక పంపారు.
ఈ నివేదిక ప్రకారం.. జిల్లా కలెక్టర్, డిపివోలు నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ 1.20కోట్లు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేశారు. కానీ 2023 డిసెంబర్ లో ప్రభుత్వం మారడంతో తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో కొంత జాప్యం జరిగింది. ముహూర్తం కుదిరి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి లు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
3నెలల క్రితం హై కోర్ట్ లో కేసు నమోదు
వెంచర్ లో ప్లాట్ విక్రయదారుడు కందికంటి సుజాత కుమారుడు దేవేందర్ నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణంపై హై కోర్ట్ లో కేసు నమోదు చేశారు. 10%ల్యాండ్ ను వెంచర్ ప్లాట్ విక్రయదారుల సౌకర్యార్థము కోసమే వాడుకోవాలని ప్రభుత్వ నియమాలు ఉన్నాయని, అలా కాకుండా ప్లాట్ విక్రయదారుల హక్కులకు భంగం కలిగించేలా 10%ల్యాండ్ లో నూతన తహసీల్దార్ భవనం నిర్మించారని హైకోర్టు లో కేసు నమోదు చేశారు. పంచాయతీ రాజ్, రెవిన్యూ శాఖ అధికారుల వాదనలు విన్న హై కోర్ట్ ఫిబ్రవరి 13న నూతన భవనంలో తహసీల్దార్ కార్యాలయ పనులు ఆపాలని అధికారులకు తెలిపింది. మరో సారి ఫిబ్రవరి 27న మార్చి 3న పూర్తి వాదనలు విన్న హై కోర్ట్ ఏ క్షణమైన తుది తీర్పును విలువరించనున్నది.






