- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
by Ratna Kumari |
మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మోకిలా ఎస్సై సాయి కృష్ణ తెలిపారు.

X
దిశ, శంకర్ పల్లి : మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మోకిలా ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. శుక్రవారం మోకిలా పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో మోకిలా, మోకిలా తండా లలో ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న చిన్న దుకాణాలు ఇతర ప్రదేశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయి కృష్ణ మాట్లాడుతూ అక్రమంగా మాదకద్రవ్యాల విక్రయం నిల్వ రవాణా మరియు వినియోగం గురించి సమాచారం తెలిస్తే సమీపంలోని పోలీసులకు తెలపాలని సూచించారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతోందని, వినియోగించడం ద్వారా డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆర్ఎస్ఐ రాము, ఆంజనేయులు తదితరులున్నారు.
Next Story






