- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరు దైవ చింతనలో భాగస్వాములు కావాలి
మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరూ దైవ చింతన కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే ఆ గ్రామంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

దిశ, మోమిన్ పేట్ : మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరూ దైవ చింతన కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే ఆ గ్రామంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్న కొలుకుంద గ్రామంలో దుర్గా భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని సర్పంచ్ బసెట్టి విశాల సంగమేశ్వర్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్పీకర్ ఆయనను అభినందించారు.
దుర్గా మాత కరుణ కటాక్షాలతో గ్రామ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో తుల తూగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే గ్రామాల్లో రాజకీయాలకతీతంగా దైవ కార్యక్రమాల్లో అందరూ సమన్వయంతో సంఘటితంగా కృషి చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తంగేడి పల్లి పీఠాధిపతి శివయోగి శివాచార్య మహాస్వామి, ధనసిరి అప్ప గారు, వీరేశ్వర శివాచార్య మహాస్వామి, జ్ఞానేశ్వరి మాత, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నె శంకర్ యాదవ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.






