- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొన్న రెండు రోజులకే ఈవీ వాహనం దగ్ధం
రోయోటో కంపెనీకి చెందిన ఈవి వాహనం కొన్న రెండు రోజులకే దగ్ధం అయిన ఘటన ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో జరిగింది.

దిశ, తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో ఓ ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా పార్క్ చేసి ఉంచిన రోయోటో కంపెనీకి చెందిన ఈవీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. బాధితుడు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీధర్ రెడ్డి చేవెళ్లలో ఉన్న రోయోటో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని రెండు రోజుల క్రితమే రూ.1.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంజాపూర్‌లో భోజనం చేసేందుకు వాహనాన్ని పార్క్ చేసి వెళ్లగా, కొద్దిసేపటికే మంటలు చెలరేగి కళ్లముందే వాహనం బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం కొనుగోలు చేసిన రెండో రోజుకే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఒకసారి పూర్తి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో నమ్మి మొత్తం ఆరు ఈవీ వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సదర్ కంపెనీ యాజమాన్యం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాన్ ఆర్టీఏ పేరుతో కొన్ని సంస్థలు తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన తనిఖీలు నిర్వహించి, ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వాహన కొనుగోలుదారులు డిమాండ్ చేశారు.






