- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో పర్యటించారు.

దిశ, మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను పొరపాట్లకు తావివ్వకుండా సమర్థవంతంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎంకేపల్లి వార్డు బీఎల్వోలను ఎస్ఐఆర్ ఫారం పంపిణీ, నింపడం, డిజిటలైజ్ ప్రక్రియపై ఆరా తీసి, ఫీల్డ్ అధికారులు, బీఎల్వోలు, ఓటర్లకు ఎదురయ్యే సమస్యలపై సందేహాలు నివృత్తి చేశారు. మండలంలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో 11వ వార్డు కౌన్సిలర్ మహేష్ విజ్ఞప్తి మేరకు ఎంకేపల్లిలోని హైస్కూల్‌లో కొత్తగా చేపట్టిన టాయిలెట్ల నిర్మాణం పరిశీలించారు. అలాగే ప్రైమరీ స్కూల్‌లో శిథిలావస్థకు చేరిన గదిని కూల్చివేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ గౌతమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.






