- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంలో కంటే తక్కువగా నమోదైన పోలింగ్ పర్సంటేజ్
షాద్ నగర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని కేశంపేట, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్ నగర్, కొందుర్గ్, జిల్లేడు చౌదరిగుడా మండలాల్లో లోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ మధ్యాహ్నం సమయం వరకు చాలా మందకొడిగా సాగుతూ సాయంత్రం ఐదు గంటల వరకు మెరుగుపడింది. గతంలో కంటే ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించుకోకపోవడం పట్లనే పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని మొత్తం 255 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ మధ్యాహ్నం వరకు 40 శాతం మాత్రమే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు ఓటర్ల ను కొంత ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లను గుర్తింపు కార్డు విషయంలో కొంత ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మధ్యాహ్నం వరకు ఓటింగ్ పర్సెంట్ చాలా మందకోడిగా సాగినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు 73.54% శాతం వరకు నమోదు అయ్యాయి.
స్వగ్రామల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఓటు హక్కును వారి స్వగ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో తను ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తన స్వగ్రామంలోని వీర్లపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంది బాబయ్య షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని పోలింగ్ బూతులు వినియోగించుకున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రశాంత్ ముదిరాజ్ కొందుర్గ్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ తమ స్థానిక వార్డుల్లో గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.






