- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ట్రాఫిక్ నిబంధనల పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.

చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
దిశ, రాజేంద్రనగర్: ట్రాఫిక్ నిబంధనల పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆరాంఘర్ చౌరస్తాలో ఎన్నో సంవత్సరాలుగా చిన్నచిన్న వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే కు విన్నవించారు. శనివారం తమను ఆదుకోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆరాంఘర్ చౌరస్తాలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హాకర్స్ కు సూచించారు. ఫుట్ పాత్ లను ఆక్రమించకుండా వెనుక వైపు వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. పోలీసు అధికారులు చేసే సూచనలు పాటించాలని వారికి ఇబ్బందులు కలిగేలా పనులు చేయొద్దని చెప్పారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ రాజు, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.






