ఈనెల 28న కుట్టు మిష‌న్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్లు పంపిణీ

by Ratna Kumari |

జ‌న‌వ‌రి 28న ఉన్న‌తి శిక్ష ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కుట్టుమిష‌న్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.

ఈనెల 28న కుట్టు మిష‌న్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్లు పంపిణీ
X

దిశ‌, త‌ల‌కొండ ప‌ల్లి : జ‌న‌వ‌రి 28న ఉన్న‌తి శిక్ష ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కుట్టుమిష‌న్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ‌, రంగారెడ్డి క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, చేత‌న ఫౌండేష‌న్ చైర్మ‌న్ వెనిగ‌ల ర‌వికుమార్ లు ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. త‌ల‌కొండ‌ప‌ల్లి మండల కేంద్రంలోని దేవకీ గార్డెన్ లో బుధ‌వారం చేతన మరియు ఉన్నతి శిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కుట్టు మిషన్లు, కూరగాయల తోపుడు బండ్లు, వికలాంగుల కోసం ట్రై సైకిళ్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్టు యూఎస్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్నారై ఎర్ర శ్రీనివాసరెడ్డి, ఫౌండేషన్ సెక్రటరీ చీపునుంతల మాజీ సర్పంచ్ బండి. రఘుపతి లు క‌లిసి ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ సభ్యులు కోరారు.

Next Story