- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
by Ratna Kumari |
జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ ఆభివృద్ధి నిర్మాణ పనులను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

X
దిశ, రాజేంద్రనగర్ : జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ ఆభివృద్ధి నిర్మాణ పనులను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి బుధవారం జోన్ పరిధిలోనీ పలు సర్కిళ్లలో జరుగుతున్న వివిధ ప్రాజెక్ట్స్, అభివృద్ధి నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రోడ్లు విస్తరణ , డ్రైనేజీ, నాలా అభివృద్ధి నిర్మాణ పనులు, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జోన్ పరిధిలో అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్ ఎస్ఈ నరేందర్ గౌడ్, ప్రాజెక్ట్ ఎస్ఈ మోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ జోనల్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు, ఈఈ, డీఈ, ఏఈ పాల్గొన్నారు.
Next Story






