- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారు మైసమ్మ ఆలయం ధ్వంసం
ప్రమాదవశాత్తు జరిగిందో పని గట్టుకొని చేశారో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, షాద్ నగర్ : ప్రమాదవశాత్తు జరిగిందో పని గట్టుకొని చేశారో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫరుఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్ నగర్, షాద్ నగర్ రహదారి సమీపంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన బంగారు మైసమ్మ ఆలయం ఉంది. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ బొలెరో వాహనంతో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న చిన్న ఆలయాన్ని రెండు సార్లు ఢీ కొట్టి ధ్వంసం చేశారని తెలిపారు. గుడిని కుల్చాలన్న దురుద్దేశంతోనే అగంతకులు రెండుసార్లు ఢీ కొట్టి నేలకూల్చారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఇన్ని ఏళ్ళుగా జరగని ప్రమాదం ఈ రోజు ఎలా జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. కోరిన కోరికలను తీర్చే బంగారు మైసమ్మ ఆలయానికి ప్రతినిత్యం భక్తులు వస్తుంటారని, ఈ సంఘటనతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆలయ అర్చకులు బ్రహ్మచారి తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ధ్వంసమైన ఆలయాన్ని బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నాయకులు సందర్శించారు. ప్రమాద స్థలాన్ని ఎస్సై సుశీల పరిశీలించారు.






