- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాన రోడ్డు పై ప్రాణాంతక గుంతలు
నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతోంది.

దిశ, యాచారం : నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతోంది. 14 ఏళ్ల క్రితం మండల కేంద్రంలోని గాండ్లగూడ, గేటు వద్ద నుంచి సాయి శరణం గార్డెన్ సమీపం వరకు గత ప్రభుత్వ హయాంలో 5 కోట్ల వ్యయంతో 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా నాలుగు వరసల సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల, ఒంగోలు, హైదరాబాద్ నుంచి వెళ్లడానికి దగ్గర కావడంతో ఈ ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది. అబ్బసాగుల దర్గా, ఆర్టీసీ బస్టాండ్, ఎస్బీఐ బ్యాంకు, రైతు వేదిక సమీపంలో సిసి రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుతున్నారు.
రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలి : స్థానికుడు మహమ్మద్ అజ్మత్
అధికారులు పట్టించుకోకపోవడంతోనె నాగార్జున సాగర్ ప్రధాన రహదారి అధ్వానంగా మారుతోందని విమర్శించారు. మరమ్మత్తులు చేపట్టకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆర్ అండ్ బీ అధికారులు స్పందించాలి : గ్రామ సర్పంచ్ మస్కు అనిత శరణం
సాగర్ రోడ్డుపై వెలగని వీధి దీపాలను సొంత ఖర్చులతో మరమ్మత్తులను చేయించినట్లు గుర్తు చేశారు. సిసి రోడ్డుపై ఉన్న గుంతలను ఆర్.అండ్.బి అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.






