మోడీ తోనే దేశం సురక్షితం : మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్

by Ratna Kumari |

దిశ, గండిపేట: కేంద్రంలో మోడీ ప్రభుత్వంతోనే దేశం సురక్షితంగా ఉంటుందని మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్

మోడీ తోనే దేశం సురక్షితం : మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్
X

దిశ, గండిపేట: కేంద్రంలో మోడీ ప్రభుత్వంతోనే దేశం సురక్షితంగా ఉంటుందని మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మణికొండ, నెక్నంపూర్ డివిజన్లలో ప్రధాని నరేంద్ర మోడీ 129వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి భారత సైనిక సత్తా చూపించామన్నారు. అదేవిధంగా క్రీడల్లోనూ అగ్రగామిగా నిలిచామని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ప్రపంచంలోనే వివిధ దేశాలకు మన దేశం నుంచి వస్తువులను ఎగుమతులు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మణికొండ బీజేపీ అధ్యక్షుడు రవి కాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ చిలుకూరి బీరప్ప, ప్రధాన కార్యదర్శి వినోద్, శివరాంరెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ మధు పాల్గొన్నారు.

Next Story