కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు : మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

by Ratna Kumari |

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు  : మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మొయినాబాద్ : కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇటీవలే మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్రోళ్ల శ్రీధర్ కౌన్సిలర్ గా విజయం సాధించగా.. గురువారం మొయినాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ యూసుఫ్ గూడా శ్రీనగర్ కాలనీ లోగల సబితా ఇంద్రారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డులో విజయం సాధించిన కర్రోల శ్రీధర్ ను సబితా ఇంద్రారెడ్డి అభినందించి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తృటిలో బీఆర్ఎస్ పార్టీకి మొయినాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ తప్పిపోయిందని, కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేస్తూ.. ప్రజా సేవకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహరెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీహరి యాదవ్, గడ్డం అంజిరెడ్డి, కొత్త మాణిక్ రెడ్డి, మోర శ్రీను, నిర్ధుల మహేందర్ రెడ్డి, కొత్తపల్లి జైపాల్ రెడ్డి, సురంగల్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎట్టయ్య గౌడ్, అశోక్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కందికొండ శ్రీకాంత్ గౌడ్, నిర్ధుల మహేష్, రాఘవేందర్ గౌడ్, మహేష్ గౌడ్, నవీన్ చారి, విగ్నేష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story