- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిగి పీఠంపై హస్తం చూపు
పరిగి మున్సిపల్‌లో 18 వార్డులకు గాను కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్‌కు 8, ఇద్దరు స్వతం త్రులు గెలుపొంది హంగ్ ఏర్పడింది. ఒకటో వార్డు నస్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కురువ అక్కమ్మను బీఆర్ఎస్ అభ్యర్థు లు తీసుకు వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి.

దిశ, పరిగి: పరిగి మున్సిపల్‌లో 18 వార్డులకు గాను కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్‌కు 8, ఇద్దరు స్వతం త్రులు గెలుపొంది హంగ్ ఏర్పడింది. ఒకటో వార్డు నస్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కురువ అక్కమ్మను బీఆర్ఎస్ అభ్యర్థు లు తీసుకు వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. మరో స్వతంత్ర అభ్యర్థి మూడో వార్డు నుం చి గెలుపొందిన మూడవత్ హనుమంతును కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ వర్గీయులు తీ సుకువెళ్లే ప్రయత్నం చేయగా గొడవ జరిగిన వి షయం తెలిసిందే. హనుమంతును పోలీసుల ప్రొటెక్షన్ ఇచ్చి వదిలేసామంటూ డీఎస్పీ శ్రీని వాస్ తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ఇంటికి వచ్చి నస్కల్ స్వతంత్ర అభ్యర్థి అక్కమ్మ వాయిస్ రికార్డ్ చేసుకోవాలంటూ పోలీసులు రాగా, స్వతంత్ర అభ్యర్థి హనుమంతును కాంగ్రెస్‌కు అప్పజెప్పి మళ్లీ, అక్కమ్మ వాయిస్ అంటూ మళ్లీ మా దగ్గరకు వచ్చారా అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొప్పుల అనిల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.
నస్కల్ గ్రామంలో వదిలి వేసిన అక్కమ్మను కాంగ్రెస్ వర్గీయులు తీసుకువెళ్లారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు మా వద్ద ఒకరు ఉన్నారని బీఆర్ఎస్ వర్గీయులు చెప్పగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థు లు కాంగ్రెస్ క్యాంపులోనే ఉన్నారు అంటూ మరికొందరు అంటున్నారు. హనుమంతును అస్సాం తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. స్వతం త్ర అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తారో, మున్సి పల్ చైర్మన్ ఏ పార్టీని వరిస్తుందో తేలాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.






