రహదారుల అభివృద్ధికి భారీ నిధులు: ఎమ్మెల్యే

by Kodari Anjali |   (  Updated:2026-06-20 09:33:16  IST  )

పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

రహదారుల అభివృద్ధికి భారీ నిధులు:  ఎమ్మెల్యే
X

దిశ, కడ్తాల్: పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మైసిగండి గ్రామానికి చెందిన విస్లావత్ తులసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి నూతన ఇంటిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల అభివృద్ధికి భారీ నిధులతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే సుమారు 3,500 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోగా, రెండో విడతలో మరో 2,500 ఇళ్లను ఈ నెలాఖరులోగా మంజూరు చేస్తామని ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత గృహం అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల అధ్యక్షుడు బిచ్య నాయక్, సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్, ఉపసర్పంచ్ హీరాసింగ్ నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేష్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story